అబ్బా.. హెబ్బా లేదంటా..!

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 03:09 PM

అబ్బా.. హెబ్బా లేదంటా..!

హైదరాబాద్, జూలై 18 : 'బిగ్‌బాస్-2‌' సీజన్ ప్రస్తుతం ఫుల్ ట్రేండింగ్ లో ఉంది. ఏమైనా జరగోచ్చు.. అంటూ నాని వ్యాఖ్యాతగా వవ్యహరిస్తున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఎలిమినేషన్స్ కారణంగా శని .. ఆదివారాల్లోని ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. 'బిగ్ బాస్ హౌస్' లో సందడి .. గ్లామర్ తగ్గినట్టుగా అనిపిస్తే, ఆ లోటును భర్తీ చేయడానికి కొంత క్రేజ్ వున్న నాయికలను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రంగంలోకి దింపుతుంటారు. అలా త్వరలో 'బిగ్ బాస్ హౌస్' లోకి హెబ్బా పటేల్ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి.

ఈ వార్త నిజమేననుకున్న వాళ్లంతా ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి హెబ్బా పటేల్ స్పందించింది. "నేను మా ఇంట్లోనే వున్నా .. మరే ఇంట్లో లేను .. ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు" అంటూ స్పష్టత ఇచ్చేసింది. దీంతో హెబ్బా పటేల్ బిగ్‌బాస్-2‌కు వస్తుందనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.





Untitled Document
Advertisements