మహిళా ఉద్యోగినులకు ప్రియాంక సర్‌ప్రైజ్‌..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 05:03 PM

మహిళా ఉద్యోగినులకు ప్రియాంక సర్‌ప్రైజ్‌..

హైదరాబాద్, జూలై 18 : బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రియాంక తన నిర్మాణ సంస్థ 'పర్పుల్‌ పెబ్బెల్‌ ప్రొడక్షన్స్‌'లో పనిచేస్తున్న ఉద్యోగినుల కోసం ఓ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. తన నిర్మాణ సంస్థలో పని చేసే వారిలో ఎక్కువ శాతం ఆడవారే ఉన్నారంట. అంతేకాదు అందులో వివాహితులే ఉన్నారని వారికోసం 12 వారాల ప్రసూతి సెలవులతో పాటు నగదు కూడా సాయం చేయనున్నట్లు ప్రియాంక నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రియాంక తల్లి మధు మీడియాతో మాట్లాడారు.

ఈ మేరకు మధు మాట్లాడుతూ.. "మా నిర్మాణ సంస్థలో ఎక్కువశాతం వివాహితలే ఉన్నారు. వారి అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువ ఇవ్వాలి. వారి ఇష్టాఇష్టాలకు వృత్తి అడ్డం కాకూడదు. వారికోసం పనివేళలో మార్పులు చేశాం. అంతేకాదు 12 వారాల పాటు ప్రసూతి సెలవులతో పాటు నగదు కూడా సాయం చేస్తాం. ఈ విషయంలో పూర్తి నిర్ణయం ప్రియాంకదే. అలాగని మగవారి పట్ల ఎలాంటి పక్షపాతం చూపడం లేదు" అంటూ వెల్లడించారు.

Untitled Document
Advertisements