'అర్జున్ రెడ్డి' కి అంతే తీసుకున్నాడా..!!

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 05:22 PM

'అర్జున్ రెడ్డి' కి అంతే తీసుకున్నాడా..!!

హైదరాబాద్, జూలై 18 : యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. సందీప్ వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. చిన్న సినిమాగా కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 50 కోట్లు వసూళ్లు చేసింది. ఇక శాటిలైట్, రీమేక్, డిజిటల్ అన్నీ కలుపుకుని విడుదలకు ముందు, విడుదల తరువాత కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఒక రేంజ్ లో కుర్రకారును ఆకట్టుకొని సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది.

అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కోసం విజయ్ భారీ మొత్తమే పారితోషికం తీసుకున్నాడని అంతా అనుకుంటారు. కానీ ఈ సినిమాకి తాను అందుకున్న పారితోషికం కేవలం 5 లక్షలు మాత్రమేనని తాజాగా ఓ సందర్భంలో విజయ్ దేవరకొండ చెప్పాడు. అయితే సినిమా విడుదల తర్వాత భారీ లాభాలు రావడంతో ఆ లాభాల నుండి తనకు వాటాగా భారీగా డబ్బు వచ్చిందని వివరించాడు. 'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత ఈ యువ హీరోకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Untitled Document
Advertisements