'దిల్‌బర్‌' కు పదికోట్లమంది ఫిదా..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 11:56 AM

'దిల్‌బర్‌' కు పదికోట్లమంది ఫిదా..

హైదరాబాద్, జూలై 19 : బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం హీరోగా 'సత్యమేవ జయతే' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జాన్‌ అబ్రహంకు జోడీగా.. ఐషా శర్మ వెండితెరకు పరిచయం కానుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిలాప్‌ జవేరి దర్శకత్వం వహిస్తుండగా ప్రతిష్టాత్మక టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అలనాటి నటి సుస్మితా సేన్‌ నటించిన 'సిర్ఫ్‌ తుమ్‌' చిత్రంలోని 'దిల్‌బర్‌..' అంటూ సాగే హిందీ గీతం శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇప్పుడదే పాటను రీమేక్‌ చేశారు. ఈ పాటలో నోరా ఫతే వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న ఈ గీతాన్ని 24 గంటల్లో 2 కోట్ల మంది వీక్షించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇప్పుడు ఏకంగా 10 కోట్లకు చేరి కొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాకుండా బిల్‌బోర్డ్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో మూడో స్థానంలో నిలిచింది. భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ పాటలో నోరా ఫతే బెల్లీ డాన్స్‌ మూమెంట్స్‌ అదుర్స్ అంటూ ఉన్నాయంటు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.

Untitled Document
Advertisements