ప్రియాంకకు అందుకే మిస్ ఇండియా ఇవ్వలేదు..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 12:50 PM

ప్రియాంకకు అందుకే మిస్ ఇండియా ఇవ్వలేదు..

ముంబై, జూలై 19 : 2000లో మిస్‌ వరల్డ్ టైటిల్‌ గెలిచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారు నటి ప్రియాంక చోప్రా. ఆమె తన 17 వ ఏటా తన రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ తరఫున ఫెమీనా మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన విషయ౦ తెలిసిందే. అయితే మిస్‌ ఇండియా పోటీల్లో ప్రియాంక మిస్‌ ఇండియా టైటిల్‌ను చేజార్చుకున్నందుకు కారణం ఎంటన్నది ఈ పోటీదారులకు మెంటార్‌గా వ్యవహరించిన ప్రదీప్‌ గుహ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "జ్యూరీలో ఉన్న వారెవ్వరూ ప్రియాంకకు మద్దతుగా లేరు. వారిలో ఓ వ్యక్తి ప్రియాంక నల్లగా ఉందని.. టైటిల్‌ ఎలా ఇస్తాం? అన్నాడు. అప్పుడు నేను కలగజేసుకుని వారికి నచ్చజెప్పాను. ఆమె నల్లగా ఉన్నప్పటికీ అందంగానే ఉన్నారని చెప్పాను. అప్పటికీ ప్రియాంకకు లారా దత్తాకు టై పడింది. వారిని కొన్ని ప్రశ్నలు అడిగి ఫలితాలు ప్రకటించాం. అలా మిస్ ఇండియాగా ప్రియాంక టైటిల్ ను మిస్ అయ్యారు. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు" అంటూ వెల్లడించారు.

Untitled Document
Advertisements