పెళ్ళికి సిద్దమైన సింగర్ సునీత..!!

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 01:09 PM

పెళ్ళికి సిద్దమైన సింగర్ సునీత..!!

హైదరాబాద్, జూలై 19 : టాలీవుడ్‌లో తన సుమధుర గానంతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు సింగర్‌ సునీత. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు వందల సినిమాలకు పనిచేశారు. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకుల్ని ఒంటరిగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సునీత మరో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. తన 19 ఏళ్ల వయసులో కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. కొన్నేళ్లుగా సింగిల్ మదర్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సునీత.. మరో పెళ్లిపై ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య రెండో పెళ్లిపై స్పందించిన ఆమె.. తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు మనసు మార్చుకొని పెళ్ళికి సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Untitled Document
Advertisements