అక్కినేని మేనకోడలు@'లేడీస్ ఆఫ్ గూడచారి'

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 01:27 PM

అక్కినేని మేనకోడలు@'లేడీస్ ఆఫ్ గూడచారి'

హైదరాబాద్, జూలై 19 : అక్కినేని నాగార్జున మేనకోడలు.. సుప్రియ యార్లగడ్డ చాలా ఏళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. సుప్రియ.. అన్నపూర్ణ బ్యానర్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో మేనమామ నాగ్ కు సహకారం అందిస్తూ ఉండేది. తాజాగా ఒక థ్రిల్లర్ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఆ చిత్రం ఏంటంటే.. 'గూడచారి'. యువ నటుడు అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా సుప్రియ పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె నదియా ఖురేషి అనే రోల్ లో కనిపిస్తుందని పోస్టర్ లో వెల్లడించారు. 'లేడీస్ అఫ్ గూడచారి' అనే క్యాప్షన్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో సుప్రియను డిప్యూటీ డైరెక్టర్ చీఫ్ టాస్క్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అని.. 92FS మోడల్ వెపన్ ను వాడుతుందని.. పోస్టర్ లో చూపించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఆగష్టు 3 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Untitled Document
Advertisements