'చిలసౌ' నుండి వీడియో సాంగ్ రిలీజ్..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 02:14 PM

'చిలసౌ' నుండి వీడియో సాంగ్ రిలీజ్..

హైదరాబాద్, జూలై 19 : సుశాంత్‌ హీరోగా నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చి ల సౌ'. హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. రుహాని శర్మ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమాను సిరుణి సినీ కార్పొరేషన్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ విడుదల చేస్తోంది.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కాగా చిత్రానికి సంబంధించి తాజాగా ఈ చిత్రంలోని వీడియో సాంగ్ బయటకు వదిలారు. ఈ పాటలో బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుందో అంటూ.. "నో.. నో.. నో.. హలో గురూ లైఫ్ అంతా మెరిసే కలర్సు.. అదేమిటో సడెన్‌గా తెలియని న్యూసెన్సు" అంటూ వివరి౦చారు. ఈ పాట బ్యాచిలర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements