చై, సామ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 03:18 PM

చై, సామ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే..

హైదరాబాద్, జూలై 19 : 'ఏం మాయ చేశావే' చిత్రంలో ప్రేమ జంటగా ప్రేక్షకులను కట్టిపడేసిన జంట నాగ చైతన్య, సమంత. వీరిద్దరూ నిజజీవితంలో వివాహబందంతో ఒక్కటయ్యారు. తాజాగా వీరిద్దరూ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో చై, సామ్ భార్యాభర్తలుగా కనిపించనుండటం విశేషం.

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు.. హరీశ్ నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 23వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఆ తర్వాత రెగ్యూలర్ గా షూటింగ్ జరుపుకోనుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణ మురళి, శత్రు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Untitled Document
Advertisements