నేనెప్పుడు అలా చెప్పలేదు..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 04:59 PM

నేనెప్పుడు అలా చెప్పలేదు..

హైదరాబాద్, జూలై 19 : కథానాయిక లావణ్య త్రిపాఠి.. ప్రస్తుతం టాలీవుడ్ లో 'ముద్ర' అనే సినిమాలో నటిస్తున్నారు. నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు మరే తెలుగు సినిమాలకు సైన్ చేయలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు దృష్టంతా బాలీవుడ్‌ వైపే ఉందని.. అందుకే ద‌క్షిణాది సినిమాల‌ను అంగీక‌రించ‌డం లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అంతేకాదు ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్‌ల చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తిచేసుకుని బాలీవుడ్‌ లో వాలిపోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకోసం భారీగా కాల్‌షీట్లు కేటాయి౦చినట్లు సమాచారం. ఈ వార్తలన్ని౦టిపై లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు లావణ్య.. తన ట్విట్టర్ లో "నాకు అన్ని భాష‌ల సినిమాల్లోనూ ప‌నిచేయాల‌ని ఉంది. కేవ‌లం బాలీవుడ్ మీద‌నే దృష్టిపెడ‌తాన‌ని నేనెప్పుడూ చెప్ప‌లేదు" అంటూ వెల్లడించింది.

Untitled Document
Advertisements