నాగశౌర్య '@నర్తనశాల' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!!

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 05:55 PM

నాగశౌర్య '@నర్తనశాల' ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!!

హైదరాబాద్, జూలై 19 : 'ఊహాలు గుసగుసలాడే' సినిమాతో కుర్రకారు హృదయాలను దోచుకున్న యువ కదానాయకుడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ యువ హీరో తన సొంత బ్యానర్ అయిన 'ఐరా క్రియేషన్స్' పతాకంపై '@నర్తనశాల' అనే చిత్ర౦లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి 'ఫస్ట్ లుక్' రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఈ మేరకు ఒక పోస్టర్ సైతం రిలీజ్ చేసింది. రేపు సాయంత్రం 6:30 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. నాగ శౌర్య ఇదివరకే తన సొంత బ్యానర్ లో 'ఛలో' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకునిగా పరిచయం అయిన ఈ చిత్రం ఘన విజయ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'కణం'., 'అమ్మమ్మగారిల్లు' సినిమాలలో నటించినా అవి పెద్దగా ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. దీంతో తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు నాగ శౌర్య. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు నాలుగింతల ఎఫర్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements