వారిద్దరూ స్నేహితులు మాత్రమే : అనుష్క అమ్మ

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 06:17 PM

వారిద్దరూ స్నేహితులు మాత్రమే : అనుష్క అమ్మ

హైదరాబాద్, జూలై 19 : టాలీవుడ్ హిట్ పెయిర్ ఎవరంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. 'బాహుబలి' సిరీస్ లు రిలీజ్ అయినప్పటి నుండి వీరిద్దరి మధ్య అనేక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలపై అనుష్క, ప్రభాస్ లు స్పందిస్తూ.. మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. తాజాగా అనుష్క తల్లి ఈ రూమర్స్‌పై స్పందించారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "వాళ్లిద్దరూ స్టార్స్.. అలాగే ఇద్దరూ కలిసి నటించారు. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్‌ కావాలనే ఉంది. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. వారి పెళ్లి గురించి ఇలా అనవసరపు వ్యాఖ్యలు చేయడం ఆపేయండి" అంటూ పేర్కొన్నారు. ఇకనైనా వీరిద్దరి మధ్య వస్తున్న రూమర్స్ ఆగుతాయేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ప్రస్తుతం "సాహో" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా.. అనుష్క భాగమతి తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు.

Untitled Document
Advertisements