ఎంత ఎత్తుకి ఎదిగినా నా బిడ్డే..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 06:42 PM

ఎంత ఎత్తుకి ఎదిగినా నా బిడ్డే..

హైదరాబాద్, జూలై 19 : ప్రముఖ నటి రేణూదేశాయ్.. ప్రస్తుతం న్యూయార్క్ వీధుల్లో విహారిస్తున్నారు. తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను రేణూ తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు 'ఏ రంగు దుస్తులైతే ధరించామో అదే రంగు టోపీలు, షూలను ధరించా౦' అంటూ పేర్కొంది.

అంతేకాకుండా నిన్నటి వరకు చిన్న పిల్లాడిలా ఉన్న అకిరా.. ఈ మధ్య ఆయన ఎదుగుదల చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆ విషయంపై కూడా తల్లి రేణుదేశాయ్ స్పందిస్తూ.. "అవును.. నా కంటే అకీరానే హైట్. నా ఎత్తు 5.8 అడుగులైతే.., అకీరా 6.3 అడుగులు. 14 యేళ్లకే 6.3 అడుగులు ఎత్తు పెరిగాడు అకీరా. తను ఎంత ఎత్తుకి ఎదిగినా నా బేబీనే" అంటూ వెల్లడించింది. అలాగే ఆద్య కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. ఇటీవలే రేణూదేశాయ్ నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ యేడాదిలోనే ఆమె వివాహం జరగనుందని తెలుస్తోంది.

Untitled Document
Advertisements