అవిశ్వాసం : ఎవరికీ ఎంతా సమయం..?

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 07:23 PM

అవిశ్వాసం : ఎవరికీ ఎంతా సమయం..?

ఢిల్లీ, జూలై 19 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుత హాట్ టాపిక్ 'అవిశ్వాస తీర్మానం'. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు బలనిరూపణకు చకచకా పావులు కదుపుతున్నాయి. అటు అధికార పార్టీ కూడా అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని అంటుంది. ఈ నేపథ్యంలో దేశరాజకీయాలు వేడెక్కాయి. ఈ చర్చ సందర్భంగా శుక్రవారం లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహ- ప్రతివ్యూహాలను రచించే పనిలో ఆయా రాజకీయ పార్టీలు పూర్తిగా తలమునకలై ఉన్నాయి. ఈ చర్చ సందర్భంగా ఏయే పార్టీ సభ్యులు ఎంత సమయం మాట్లాడాలనే అంశానికి సంబంధించి షెడ్యూల్‌ను గురువారం విడుదలైంది.

అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు బీజేపీకు అత్యధికంగా 3 గంటల 33 నిమిషాలు సమయాన్ని కేటాయించారు. ఇకపోతే, కాంగ్రెస్‌కు 38 నిమిషాలు, అన్నాడీఎంకేకు 29 నిమిషాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 27 నిమిషాలు, బీజేడీకు 15 నిమిషాలు, శివసేనకు 14 నిమిషాలు, తెదేపాకు 13 నిమిషాలు, తెరాసకు 9 నిమిషాలు, సీపీఎంకు 7 నిమిషాలు, సమాజ్‌వాదీ పార్టీకి 6 నిమిషాలు, ఎన్సీపీకి 6 నిమిషాలు, ఎల్‌జెఎస్‌పీకు 5 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయిస్తూ లోక్‌సభ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు.





Untitled Document
Advertisements