మరో ఎన్ఆర్ఐ యువకుడి దారుణహత్య..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 10:29 PM

మరో ఎన్ఆర్ఐ యువకుడి దారుణహత్య..

టొరంటో, జూలై 19 : భారత సంతతికి చెందిన 27 ఏళ్ల యువకుడు మీద దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఇటీవల వరంగల్ వాసి శరత్ మరణం మరవకముందే ఈ ఘటన జరగడం దారుణం. కెనడాలోని బ్రామ్‌ప్టన్‌ నగరంలో నివసిస్తోన్న 27 ఏళ్ల ట్రక్‌ డ్రైవర్‌ను టీనేజీ యువకులు కాల్చి చంపారు. 2009న భారత్ నుండి కెనడాకు వలస వెళ్లిన పల్వీందర్‌ సింగ్ అక్కడ ట్రక్‌ డ్రైవర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. కొందరు దుండగులు ఒక్కసారిగా అతడి ఇంట్లోకి దూసుకు వచ్చి కాల్పులు జరిపారు.

మిస్సిస్సాగా ప్రాంతానికి చెందిన 18, 19 ఏళ్ల యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన అనంతరం ముగ్గురు దుండగులు పారిపోయారని స్థానికులు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసుల అదుపులోకి విచారిస్తున్నారు. 'ఇది చాలా విషాదకర విషయం. రెండు రోజుల క్రితమే నీ పుట్టిన రోజు జరిగింది. నిన్ను చంపడానికి కారణమేంటో తెలీదు' అని అతడి స్నేహితుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.


Untitled Document
Advertisements