లిటిల్ ప్రిన్సెస్ కు స్పెషల్ కేక్..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 11:45 AM

లిటిల్ ప్రిన్సెస్ కు స్పెషల్ కేక్..

హైదరాబాద్, జూలై 20 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఆరేళ్లు నిండి ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. సితార పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని ఓ స్టార్ హోటల్ లో మహేష్ కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తన పుట్టినరోజుకు స్పెషల్ కేక్‌ను డిజైన్ చేయించారు మహేష్. తన ఫ్యామిలీ ఫోటోతో ఈ కేక్ ను డిజైన్ చేయించారు. ఈ మేరకు మహేష్ సోషల్ మీడియాలో 'తన లిటిల్ ప్రిన్సెస్ సితార ఆరో పుట్టిన రోజు వేడుకలు' అంటూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారట. ఇందుకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. పల్లెటూరి వాతావరణం కోసం ఫిలింసిటీలో విలేజ్ సెట్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements