'సాక్ష్యం' కు విలక్షణ నటుడు గొంతు అరువు..!!

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 01:30 PM

'సాక్ష్యం' కు విలక్షణ నటుడు గొంతు అరువు..!!

హైదరాబాద్, జూలై 20 : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, శ్రీవాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "సాక్ష్యం". ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తో౦ది. పంచభూతాలు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన గొంతును అరువివ్వనున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పూర్తిగా పంచభూతలతో తెరకెక్కుతుంది కావున ఒక పాపులర్ నటుడి వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని దర్శకుడు భావించారట.

ఇదే విషయమై ప్రకాష్ రాజ్ ను సంప్రదించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ కు ప్రొడ్యూసర్‌తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో తన గొంతును అరువివ్వడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్థర్ ఏ విల్సన్, పీటర్ హెయిన్స్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హర్షవర్థన్ ఈ సినిమాకు స్వరాలూ సమకూర్చారు. జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Untitled Document
Advertisements