'లవర్' తోనైనా రాజ్ తరుణ్ రాత మారుతుందా..!

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 01:51 PM

'లవర్' తోనైనా రాజ్ తరుణ్ రాత మారుతుందా..!

హైదరాబాద్, జూలై 20 : యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావ', 'కుమారి 21 ఎఫ్' చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు. కాని తర్వాత అదృష్టం అడ్డం తిరిగి అతను చేసిన సినిమాలన్ని వరుసగా ప్లాప్ లిస్టులో చేరాయి. దీంతో అతనికున్న మార్కెట్ మొత్తం పడిపోయింది. ఈ తరుణంలో రాజ్ తరుణ్ తాజా చిత్రం 'లవర్' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యారు. గత రెండేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. కొత్త ఏడాదిలో 'రంగులరాట్నం'.. 'రాజుగాడు' మరీ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో ఇప్పుడు అతడి ఆశలన్నీ 'లవర్' మీదే ఉన్నాయి.

దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడంతో రాజ్ తరుణ్ రాత మారుతుందేమో అని చూస్తున్నారు. ‘అలా ఎలా’తో హిట్ కొట్టిన అనీష్ కృష్ణ డైరెక్ట్ చేయడం కూడా ఆశలు రేపుతోంది. ఐతే ఈ చిత్ర ప్రమోషన్లలో దిల్ రాజు సైతం సినిమాపై ఏమంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయలేదు. ఈ రోజుల్లో చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం.. రిలీజ్ చేయడం ఎంత కష్టమైపోతోందో చెబుతూ.. పరోక్షంగా ‘లవర్’ విషయంలో తనకున్న టెన్షనంతా దిల్ రాజు బయటపెట్టాడు. రాజ్ తరుణ్ మార్కెట్ నాలుగు కోట్లే అని.. కానీ అతడి మార్కెట్‌కు రెట్టింపు ఖర్చు పెట్టామని అన్నాడాయన. ఐతే తన అన్న కొడుకు హర్షిత్ పూర్తి స్థాయి నిర్మాతగా మారడంతో రాజు రాజీ పడకుండా ఈ సినిమాకు ఖర్చు పెట్టాడు. మరి ఈ చిత్రం వీళ్లందరికీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Untitled Document
Advertisements