నాని సినిమాకు అనిరుధ్ సంగీతం..!!

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 02:16 PM

నాని సినిమాకు అనిరుధ్ సంగీతం..!!

హైదరాబాద్, జూలై 20 : త‌మిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎదిగి 'అజ్ఞాత‌వాసి' తో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన సంగీత దర్శకుడు అనిరుధ్‌. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అవకాశాలు కోల్పోయాడు. ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే.. పరిస్థితి అంత తలకిందులు అవుతోంది. తాజాగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు ముందుగా అనిరుధ్ ఓకే అయినా.. ఆ తరువాత ఈ సినిమా నుండి అతను వైదొలిగాడు.

'అజ్ఞాత‌వాసి' సినిమా డిజాస్ట‌ర్‌గా మార‌డంతోపాటు పాటలు కూడా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో అనిరుధ్‌కు తెలుగు నుంచి అవ‌కాశాలు రాలేదు. తాజాగా అనిరుధ్‌కు టాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది. నేచుర‌ల్ స్టార్ నాని తన నెక్ట్స్ ప్రాజెక్టు కు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. నాని హీరోగా గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'జెర్సీ'కి సంగీతం అందించే అవ‌కాశం అనిరుధ్‌కు వ‌చ్చింది. మ‌రి, ఈ అవ‌కాశాన్నైనా అనిరుధ్ వినియోగించుకుంటాడో లేదో చూడాలి.

Untitled Document
Advertisements