రాఫెల్ రగడ..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 02:25 PM

రాఫెల్ రగడ..

ఢిల్లీ, జూలై 20 : పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో 'అవిశ్వాస తీర్మానం' రచ్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. "యూపీఏ హయాంలో ఒక్కో రాఫెల్‌ విమానం ఖరీదు రూ.520కోట్లు. ప్రధాని ఫ్రాన్స్ వెళ్లి ఎవరితోనో చర్చలు జరిపారు. ఇప్పడు విమానం ఖరీదు రూ.1,600కోట్లు. ప్రధాని ఎవరితో కలిసి ఫ్రాన్స్ వెళ్లారో చెప్పాలి. నేనే స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిశాను. ఆయన ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారు. రక్షణ మంత్రి అబద్ధాలు చెబుతున్నారు. ఒక వ్యక్తికి రాఫెల్‌ కాంట్రాక్టు వెళ్లింది. ఆయనకు వేల కోట్ల లాభం చేకూరింది’ అని రాహుల్‌గాంధీ ఆరోపణలు చేశారు.

రాహుల్‌ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌ మాట్లాడుతూ.. "స్పీకర్‌ అనుమతి లేకుండా సభలో ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారని నిలదీశారు. సభలో ఆరోపణలు చేసే సమయంలో స్పష్టమైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.





Untitled Document
Advertisements