'లేడీ లవ్ అఫ్ గూడచారి'@ శోభిత ధూళిపాళ..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 03:19 PM

'లేడీ లవ్ అఫ్ గూడచారి'@ శోభిత ధూళిపాళ..

హైదరాబాద్, జూలై 20 : యువ నటుడు అడివి శేష్‌ హీరోగా శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గూడచారి'. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 'లేడీ లవ్ అఫ్ గూడచారి' అంటూ హీరోయిన్ శోభిత ను పరిచయం చేశారు.

ఈ సినిమాలో సమీర రావు అనే పాత్రలో శోభిత నటిస్తుందని విలియమ్ అలెన్ కాలేజ్ హార్వర్డ్ యూనివర్సిటీ లో సైకాలజీ మేజర్ చదివినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల యార్లగడ్డ సుప్రియ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె నదియా ఖురేషి అనే రోల్ లో కనిపిస్తుందని 'లేడీస్ అఫ్ గూడచారి' అనే క్యాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్ర౦ హీరోయిన్ శోభిత ధూళిపాళ మొదటి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.





Untitled Document
Advertisements