'ఇడియట్' అంటే.. అతనే.. !

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 03:46 PM

'ఇడియట్' అంటే.. అతనే.. !

శాన్‌ఫ్రాన్సిస్‌కో, జూలై 20 : ప్రముఖ దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో ‘ఇడియట్’ అని సెర్చ్‌ చేస్తే ఇమేజెస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫొటోలు వస్తున్నాయి. గతంలో కూడా చాలాసార్లు గూగుల్‌లో ఇలాంటి తప్పు సమాచారం, ఫొటోలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గూగుల్‌ అల్గారిథంలో పొరపాట్ల కారణంగా ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. కొందరు ఆన్‌లైన్‌ యాక్టివిస్ట్‌లు గూగుల్‌ అల్గారిథమ్స్‌ను మార్చడం వల్ల ఇలా జరుగుతుందని, 'ఇడియట్‌' అనే పదాన్ని ట్రంప్‌ ఫొటోకు జత చేయడం వల్ల అలా సెర్చ్‌ చేసినప్పుడు ట్రంప్‌ ఫొటోలు వస్తున్నాయిని సీనెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

ట్రంప్‌ విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నవారు ఈ విధంగా ఆన్‌లైన్‌ ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ ఫొటోను ఇడియట్‌ అనే పదంతో జత చేశారు. గతంలో ఇలాగే గూగుల్‌లో ‘పప్పు’ అని టైప్‌ చేస్తే రాహుల్‌ గాంధీ ఫొటో వచ్చింది. ‘ఫేకు’ అని సెర్చ్‌ చేస్తే నరేంద్ర మోదీ ఫొటో వచ్చింది.





Untitled Document
Advertisements