ఆసక్తిరేపుతున్న శ్రియ న్యూ పోస్టర్..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 04:06 PM

ఆసక్తిరేపుతున్న శ్రియ న్యూ పోస్టర్..

హైదరాబాద్, జూలై 20 : టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో ఒకరైన హీరోయిన్ శ్రియ. ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చింది. తాజాగా 'వీర భోగ వ‌సంత రాయ‌లు' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబా క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్‌పై అప్పారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంద్ర‌సేన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమాలో నారా రోహిత్‌, శ్రీ విష్ణు, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శ్రియ లుక్‌ను చిత్ర‌బృందం విడుదల చేసింది. ఆ ఫోటోలో శ్రియ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తోంది. న్యూ హెయిర్ స్టైల్.. న్యూ కాస్ట్యూమ్ లో సరికొత్తగా కనిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Untitled Document
Advertisements