మమతా మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 06:03 PM

మమతా మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు..

హైదరాబాద్, జూలై 20 : ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమను కుదిపేస్తున్న అంశం ఏదన్నా ఉందా అంటే అది 'కాస్టింగ్ కౌచ్'. ఈ సమస్యపై ఇప్పటికే పలువురు హీరోయిన్స్ గళం విప్పారు. మరికొంతమంది ఒకడుగు ముందుకు వేసి ఈ సమస్యపై ఏకంగా పోరాటాలే చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మ‌మ‌తా మోహ‌న్‌దాస్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ప్రస్తుతం మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మమత ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. "ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ ఎక్కువ‌గా అందమైన అమ్మాయిల‌కే ఎదుర‌వుతుంటాయి. అందంగా ఉండని ఆడవారి జీవితాలు సంతోషంగానే ఉంటాయి. వారు ప్రేమ, వృత్తి విషయాల్లో బాగానే రాణిస్తారు. అందంగా ఉన్న అమ్మాయి స‌మాజంలో ధైర్యంగా బ‌త‌క‌డం క‌ష్టం. పురుషుడెవ‌రైనా ఒక మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే.. అందుకు బాధ్యత ఆమెదే. అంద‌రి విష‌యాల్లోనూ ఇలా జ‌ర‌గక‌పోవ‌చ్చు.

కొంద‌రు మ‌హిళ‌లు హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తిస్తారు. ఆడవారికి అభద్రతాభావం ఎక్కువ. ఎవరైనా కామెంట్స్‌ చేస్తే రెచ్చగొట్టినట్లుగా ఫీలవుతారు. అన్ని వేళలా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు" అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియాలో విమ‌ర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక ఆడపిల్ల అయి ఉండి ఇలా మహిళల పట్ల ఇలా మాట్లాడి కించపరచడానికి మనసెలా వచ్చింది.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Untitled Document
Advertisements