నాగ శౌర్య 'నర్తనశాల' ఫస్ట్ లుక్' రిలీజ్..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 06:44 PM

నాగ శౌర్య 'నర్తనశాల' ఫస్ట్ లుక్' రిలీజ్..

హైదరాబాద్, జూలై 20 : యువ కదానాయకుడు నాగశౌర్య ప్రస్తుతం తన సొంత బ్యానర్ 'ఐరా క్రియేషన్స్' పతాకంపై '@నర్తనశాల' అనే చిత్ర౦లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి కాసేపటి క్రితం చిత్ర యూనిట్ 'ఫస్ట్ లుక్' రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో నాగ శౌర్య పంచెకట్టులో ఆకట్టుకున్నారు. ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్న ఈ హీరో లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఉష మల్పురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా నాగ శౌర్య ఇదివరకే తన సొంత బ్యానర్ లో 'ఛలో' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ చిత్రం ఘన విజయ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'కణం'., 'అమ్మమ్మగారిల్లు' సినిమాలలో నటించినా అవి పెద్దగా ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. దీంతో తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.





Untitled Document
Advertisements