సమంత "యూ టర్న్" ఫస్ట్ లుక్ విడుదల

     Written by : smtv Desk | Sun, Jul 22, 2018, 03:16 PM

సమంత

సమంత ప్రధాన పాత్రలో ‘యూ టర్న్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది.మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

"రంగస్థలం, అభిమన్యుడు, మహానటి" చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకోవడంతోపాటు.. నటిగా తన స్థాయిని పెంచుకొన్న సమంత "యూ టర్న్"తో తన నటవిశ్వరూపం చూపనుంది. కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో ఓ కీలకపాత్రలో భూమిక నటించారు.

చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలవ్వగా.. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. సమంత వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు

కన్నడలో కేవలం రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన యూటర్న్ సినిమా అందుకు అనేక రెట్ల వసూళ్లను సాధించింది. ఇప్పటికే ఈ సినిమా మలయాళంలో కూడా రీమేక్ అయ్యింది. ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడానికి రాబోతోంది.Untitled Document
Advertisements