ధోనీ కట్టిన టాక్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

     Written by : smtv Desk | Tue, Jul 24, 2018, 02:21 PM

ధోనీ కట్టిన టాక్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారీ మొత్తంలో ఆదాయపు పన్ను కట్టి తాజాగా వార్తల్లో నిలిచారు. జార్ఖండ్ లో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా ధోనీ నిలిచాడని ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు పేర్కొన్నారు

కెప్టెన్సీ వదిలేసినా కానీ ఆయన ఆదాయం మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ టాక్స్ ద్వారా తెలుస్తుంది..కోటి కాదు రెండు కోట్లు కావు ఏకంగా రూ. 12.17 కోట్లు టాక్స్ కట్టినట్లు ఝార్కండ్‌ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.

2017-18 ఆర్థిక సంవత్సరానికి ధోని రూ.12.17 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గతేడాదితో పోల్చుకుంటే రూ.1.24 కోట్లు ఎక్కువని పేర్కొన్నారు. గతేడాది ధోని రూ.10.93 కోట్లను చెల్లించి జార్ఖండ్-బిహార్ ప్రాంతంలో ఎక్కువ పన్నును చెల్లించిన వ్యక్తిగా నిలిచారన్నారు.

2015లో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న టాప్-100 అథ్లెట్స్‌ జాబితాలో నిలిచిన ధోనీ.. ఆ తర్వాత 2016 ఆరంభంలో భారత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

Untitled Document
Advertisements