డాక్టర్ ని పెళ్లి చేసుకోనున్న తమన్నా

     Written by : smtv Desk | Wed, Jul 25, 2018, 07:01 PM

డాక్టర్ ని పెళ్లి చేసుకోనున్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నాకి "బాహుబలి" తరువాత తెలుగు పెద్దగా అవకాశాలు లేవు. ఈ మధ్య కళ్యాణ్ రామ్ తో జత కట్టి "నా నువ్వే" అనే సినిమాలో నటించిన గాని ఆ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు తమన్నా చేతిలో ప్రస్తుతం "క్వీన్" రీమేక్ ఒక్కటే సినిమా ఉంది. అయితే ఇక తన కెరీర్ చివరి దశకి వచ్చింది అనుకుంది ఏమో గాని పెళ్లి వైపు అడుగులు వేస్తుంది తమన్నా.

తమన్నా ఓ ఇంటివారు కాబోతున్నారని చాలా కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ వైద్యుడిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. దాంతో తమన్నా పెళ్లి వార్తలు కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.అతడు డాక్టర్ కావడం అలాగే అతడికి పలు వ్యాపారాలు కూడా ఉండటంతో వెల్ సెటిల్డ్ అయిన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తమన్నా రెడీ అయినట్టు తెలుస్తుంది.

అలాగే తమన్నా కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్ళికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉంటుంది అంట తమన్నా. ఇంకా తమన్నా నుంచి పెళ్లి పై ఎటువంటి ప్రకటన లేదు.

Untitled Document
Advertisements