6 కోట్లు డిమాండ్‌ చేస్తున్న హీరో

     Written by : smtv Desk | Wed, Jul 25, 2018, 07:20 PM

6 కోట్లు డిమాండ్‌ చేస్తున్న హీరో

ఏ చిత్రసీమలో అయినా నటీనటుల జయాపజయాల మీదనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ విడుదలయి సంచలన విజయం అందుకున్న సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు. ఈ చిత్రంలో అచ్చం సంజయ్ లానే నటించాడని రణబీర్ కు ప్రశంశల వర్షం కురుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఈ విజయం నేపథ్యంలో రణ్‌బీర్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తన పారితోషికం పెంచినట్లు సమాచారం. ఇనాళ్లూ ఆయన కమర్షియల్‌ వర్క్‌కు రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు తీసుకునేవారని, కానీ ఇప్పుడు రోజుకు రూ.6 కోట్లు అడుగుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన దాదాపు 10 బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం.కాగా ప్రస్తుతం రణబీర్ బ్రహ్మాస్త్ర అనే చిత్రంలో అమితాబ్ తో కలిసి నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు…..

Untitled Document
Advertisements