యాంకర్ శ్యామల: ఎన్టీఆర్ .. నానీలను ఒకరితో ఒకరిని పోల్చలేం

     Written by : smtv Desk | Thu, Jul 26, 2018, 01:05 PM

 యాంకర్ శ్యామల: ఎన్టీఆర్ .. నానీలను ఒకరితో ఒకరిని పోల్చలేం

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 మొదలైన తర్వాత నాని ఈ షోను హోస్ట్ చేస్తున్న తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్‍‌తో కంపేర్ చేశారు. యంగ్ టైగర్ స్థాయిలో నాని ప్రేక్షకులను అలరించ లేక పోయారని కొందరు, నాని స్టైల్ నానిదే... ఆయన నేచురల్ పెర్ఫార్మర్ అని కొందరు ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి.

యాంకర్ శ్యామల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం ఇచ్చారు."ఎన్టీఆర్ .. నానీలను ఒకరితో ఒకరిని పోల్చలేం .. ఎవరి స్టైల్ వారిది. నానికి నాచురల్ స్టార్ అనే పేరుంది .. ఆయన యాంకరింగ్ కూడా చాలా నాచురల్ గానే వుంది. సినిమాల్లో ఆయనని మనం పక్కింటి అబ్బాయిలా చూస్తూ వచ్చాం. అందువలన ఆయన ఈ షోలో కోటు వేసుకుంటే కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు. ఆయనను కోటులో చూసినప్పుడు .. పక్కింటబ్బాయిలానే బాగున్నాడని అనిపించింది .. ఆ తరువాత అలవాటు పడిపోయాను. లుక్స్ విషయంలో తప్ప ఆయనలో మరెలాంటి మార్పు లేదనేది నా ఫీలింగ్. ఆయనకి కోపం వస్తే తిడుతున్నారు .. నచ్చితే మెచ్చుకుంటున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements