సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం

     Written by : smtv Desk | Thu, Jul 26, 2018, 03:37 PM

సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ల‌భించింది. దీంతో ఈ నెల 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. వాస్తవానికి కొన్ని రోజులముందే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకోవలసి వుంది. అయితే అనుమతులు లేకుండగా షూటింగులో జంతువులను .. పక్షులను ఉపయోగించారనే టాక్ వచ్చింది . ఈ కారణంగానే సెన్సార్ చేయడానికి అధికారులు నిరాకరించారని చెప్పుకున్నారు.

ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. పంచభూతాలు అనే నేచర్ కాన్సెప్ట్ పై వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వరం సంగీతం అందించారు. ఏ. విల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మీనా తదితరులు నటించారు.

Untitled Document
Advertisements