‘బ్రాండ్ బాబు’ ట్రైలర్

     Written by : smtv Desk | Thu, Jul 26, 2018, 05:22 PM

‘బ్రాండ్ బాబు’ ట్రైలర్

దర్శకుడు మారుతి.. మరో యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రభాకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘బ్రాండ్‌ బాబు’ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.సుమంత్ శైలేంద్ర (నూతన పరిచయం) .. ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించగా.. ప్ర‌భాక‌ర్‌.పి దర్శకత్వం వహించారు.తాజాగా విడుదలైన ట్రైలర్‌లో హీరోకి బ్రాండ్ అనే రోగం ఉంది. బ్రాండ్ ఉన్న వస్తువుల్ని మాత్రమే ఇష్టపడే పాత్రలో సుమంత్ శైలేంద్ర కామెడీ పండిస్తున్నాడు. ‘మనం వేసుకునే బట్టలకే ఇంత ఇంపాటెన్స్ ఇస్తాం.. మన ఇంటికి వచ్చే అమ్మాయి ఏ రేంజ్ బ్రాండ్ అయ్యి ఉండాలి డాడ్’ అంటూ మురళీశర్మతో బ్రాండ్ బాబు చెప్పడం చివరికి రోడ్ సైడ్ బ్రాండ్ అమ్మాయి ప్రేమలో పడటం చాలా ఫన్నీగా సాగింది. ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసిన దర్శకుడు ‘బ్రాండ్ బాబు’ వీక్‌నెస్‌ను ఎంత వరకూ క్యాష్ చేసుకుంటాడో చూడాలి.

Untitled Document
Advertisements