పుతిన్‌ గిఫ్ట్‌లో మైక్రోచిప్‌

     Written by : smtv Desk | Thu, Jul 26, 2018, 06:33 PM

పుతిన్‌ గిఫ్ట్‌లో మైక్రోచిప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య హెల్సింకిలో జరిగిన సమావేశం సంచలనాలు రేకెత్తిస్తోంది. ఈ సదస్సులో పుతిన్‌, ట్రంప్‌నకు ఫుట్‌బాల్‌ను ప్రెజెంట్‌ చేశారు. అయితే, బంతిలో మైక్రోచిప్‌ ఉందంటూ అమెరికా సెనేటర్‌ లిండ్స్‌ గ్రాహమ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆ అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆ బాల్‌లో చిప్‌ ఉంది. కానీ దానిని రష్యన్‌ హ్యాకర్లు అమర్చలేదు... బంతిని తయారు చేసిన అడిడాస్‌ ఏజీనే అమర్చింది.ప్రపంచకప్‌ సందర్భంగా బంతిని ప్రత్యేకంగా తయారు చేసినట్లు పేర్కొంది. అందులో అమర్చిన చిప్‌ ద్వారా తన్నడానికి దగ్గరకు వచ్చిన ఆటగాడి వివరాలను ప్రేక్షకులకు చేరవేసేందుకు ఇలా చేశామని తెలిపింది. కాగా, పుతిన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన ఫుట్‌బాల్‌ను ట్రంప్‌ 12 ఏళ్ల బారన్‌(ట్రంప​ తనయుడు)కు ఇచ్చారు.





Untitled Document
Advertisements