ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

     Written by : smtv Desk | Thu, Jul 26, 2018, 07:18 PM

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు

ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మణిరత్నం పలు హిట్ చిత్రాలు తెరకెక్కించారు. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన గీతాంజలి చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రముఖ సినీ నటి సుహాసినిని మణిరత్నం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాయకుడు, దళపతి, గీతాంజలితో పాటు పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.





Untitled Document
Advertisements