టి-శాట్‌ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్‌

     Written by : smtv Desk | Fri, Jul 27, 2018, 02:03 PM

టి-శాట్‌ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్‌

బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం టి-శాట్‌ మొదటి వార్షికోత్సవాలను నిర్వహించారు. యూనివర్సిటీ ఆవరణలో ఉన్న టీ–సాట్‌ భవనంలో ఓ ఫ్లోర్‌లో టీటీడీకి చెందిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కనిపించారు. ఇదే భవనం స్టూడియోలో తమ అన్నమయ్య పాటకుపట్టాభిషేకం అనే సెట్‌ ఉందని పాటల కార్యక్రమం కొనసాగుతున్నదని రావాల్సిందిగా ఆహ్వానించారు. రాఘవేంద్రరావు ఆహ్వానంతో కేటీఆర్‌ ఆసెట్‌లోకి వెళ్లి గాయకులను పలకరించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాఘవేంద్రరావు, కీరవాణి, సునీత జ్ఞాపికను అందజేశారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేటీఆర్‌ మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీఐఎస్‌, రైల్వే, స్టాఫ్‌ సెలక్షన్‌, ఆర్మీ ఇలా వివిధ విభాగాల్లో తెలంగాణ నుంచి ఎంపికవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. వీటిలో రాష్ట్ర వాటా పెంచేందుకు నాణ్యమైన శిక్షణను, అవసరమైన సామగ్రిని అందించాలని యోచిస్తున్నాం. ఉన్నత విద్యామండలి, టి-శాట్‌, ఐటీ విభాగాలతో కలిసి 31 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.





Untitled Document
Advertisements