కలాంకు దేశం ఘన నివాళి

     Written by : smtv Desk | Fri, Jul 27, 2018, 04:20 PM

కలాంకు దేశం ఘన నివాళి

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి. ఈ మాటను పది మందికి చెప్పడమే కాదు. తాను కూడా ఆచరించి.. జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు.. మాజీ రాష్ట్రపతి, భారతరత్న APJ అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాంకు దేశ ప్రజానీకం నివాళులర్పించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. అబ్దుల్ కలాంకు నివాళులర్పించారు. ఈ మేరకు కలాం ఫోటోను కేటీఆర్ ట్వీట్ చేశారు.

శుక్రవారం(జూలై-27) కలాం వర్ధంతి సందర్భంగా… దేశం ఆ మహానుభావుడి సేవలు స్మరించుకుంటోంది.అబ్దుల్ కలాం.. 2015, జులై 27న గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 2002-2007 మధ్యకాలంలో 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి సేవలందించారు.

తమిళనాడులోని రామేశ్వరంలో.. పేద ముస్లిం కుటుంబంలో పుట్టి… దేశాన్ని మిస్సైల్ పవర్ గా మార్చిన గొప్ప వ్యక్తి… మాజీ రాష్ట్రపతి, ఏపీజే అబ్దుల్ కలాం. 1931, అక్టోబర్ 15న జన్మించిన ఆయన… తర్వాత కాలంలో దేశ ముఖ చిత్రాన్నే మార్చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.





Untitled Document
Advertisements