ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇక లేరు

     Written by : smtv Desk | Fri, Jul 27, 2018, 05:48 PM

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇక లేరు

జపాన్‌, జూలై 27: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె వయసు 117 ఏండ్లు. జపాన్‌కు చెందిన చియో మియాకో గత ఆదివారం కనగవాలో మృతి చెందింది. మియాకో మే 2, 1901లో జన్మించింది. గత ఏప్రిల్‌లో మియాకో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా చరిత్రకెక్కింది. సౌత్ జపాన్‌లోని కికాయ్ ఐలాండ్‌కు చెందిన నబి తజిమా తన 117 ఏండ్లకు మరణించడంతో మియాకో అత్యంత వృద్ధురాలుగా నిలిచింది.

మియాకోను తన ఫ్యామిలీ మెంబర్స్ దేవతగా కొలుస్తారట. ఎప్పుడూ సరదాగా ఉండే మియాకో చాలా ప్రశాంతంగా ఉండటంతో పాటు వేరే వాళ్ల మీద దయను కనబరుస్తుందట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తనకు అత్యంత వృద్ధురాలు అనే టైటిల్ ఇచ్చి స‌ర్టిఫికెట్‌తో స‌త్క‌రించింది. మియాకోకు కాల్లిగ్రఫీ అంటే చాలా ఇష్టం అని.. చనిపోయే వరకు కాల్లిగ్రఫీని మియాకో ప్రాక్టిస్ చేసేదని గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ఇంకా.. సుషి వంటకం, ఈల్ చేప వంటకం అంటే మియాకోకు చాలా ఇష్టం అని వాళ్లు తెలిపారు.

ఇక.. మియాకో తర్వాత సౌత్ జపాన్‌లోని ఫుకువొరాకు చెందిన 115 ఏండ్ల కానె టనక అత్యంత వృద్ధురాలుగా రికార్డుకెక్కినప్పటికీ.. తన రికార్డును కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుందని గిన్నిస్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు మసాజో నొనాక తన 113వ బర్త్‌డేను గత బుధవారం జరుపుకున్నాడు. ఆయన కూడా జపాన్‌కు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.

Untitled Document
Advertisements