డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 'రంగస్థలం' సింగర్‌

     Written by : smtv Desk | Sat, Jul 28, 2018, 03:08 PM

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 'రంగస్థలం' సింగర్‌

హైదరాబాద్‌, జూలై 28: జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగoజ్ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేస్తే 175 ఎంజీ వచ్చింది.

అయితే తాను తాగలేదని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో యాంకర్‌, నటుడు లోబో కూడా రాహుల్‌తో ఉన్నారు. లైసెన్స్‌ కూడా లేకుండానే రాహుల్‌ సిప్లిగంజ్ కారు నడిపినట్టు తెలుస్తోంది.

పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవలే రంగస్థలం టైటిల్‌ సాంగ్‌ కూడా రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు.

Untitled Document
Advertisements