శ్రీవిష్ణు ఫస్టులుక్

     Written by : smtv Desk | Sat, Jul 28, 2018, 07:11 PM

</strong></strong></strong>శ్రీవిష్ణు ఫస్టులుక్

‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో హిట్‌ను సొంతం చేసుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాతో వస్తున్నాడు. ఇతడితో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ శరణ్‌లు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌ లుక్ విడుదల అయ్యింది.

ఈ నాలుగు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. తెల్లని గుర్రంతో కూడిన ఈ పోస్టర్ ఆయన పాత్రలోని కొత్తదనానికి అద్దం పడుతోంది. మొత్తానికి ఈ సినిమా పోస్టర్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరికి ఈ సినిమాను గురించి చర్చించుకునేలా చేస్తోంది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇంద్రసేన ఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పారావు బెల్లన నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

Untitled Document
Advertisements