హ‌్యాపీవెడ్డింగ్ రివ్యూ

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 05:36 PM

హ‌్యాపీవెడ్డింగ్ రివ్యూ

ఒక‌మ‌న‌సు సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. మెగా వారింటి ప‌రువు కాపాడ‌టానికి చూస్తోన్న అమ్మాయి నిహారిక కొణిదెల‌. తొలి సినిమా ఫ్లాప్ కావ‌డంతో బాగా ఫీలైన ఈ ముద్దుగుమ్మ ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? ఇదైనా నిహారిక ఆశ‌ల‌ను తీర్చేసిందా..?

క‌థ‌:
అక్ష‌ర‌(నిహారిక‌) క‌న్ఫ్యూజ‌న్ అమ్మాయి. లైఫ్ లో ఏ నిర్ణ‌యం కూడా త్వ‌ర‌గా తీసుకోలేదు.. సొంతంగా అస్స‌లు ఆలోచించ‌లేదు. అలాంటి అమ్మాయికి ఆనంద్(సుమంత్ అశ్విన్) న‌చ్చుతాడు. ప్రేమించుకుంటారు.. పెళ్లికి కూడా సిద్ధ‌మ‌వుతారు. కానీ అంత‌కుముందే అక్ష‌ర జీవితంలో విజ‌య్(రాజా) ఉంటాడు. అత‌డితో విడిపోయిన త‌ర్వాత ఆనంద్ ప‌రిచ‌యం అవుతాడు. కానీ విజ‌య్ రాక‌తో అక్ష‌ర‌లో మ‌ళ్లీ క‌న్ఫ్యూజ‌న్ మొద‌లవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది..? ఎవ‌ర్ని పెళ్లి చేసుకుంది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ఒక మ‌న‌సు చాలా బ‌రువైన క‌థ‌. ఆ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది నిహారిక‌. తొలి సినిమాలో న‌ట‌న‌కు మంచి మార్కులు వేయించుకున్న నిహారిక‌.. ఇప్పుడు రెండో సినిమాతో కాస్త లైట్ క‌థ‌తో వ‌చ్చింది. ప‌క్కింటి అమ్మాయి ల‌క్ష‌ణాల‌తో పాటు క‌న్ఫ్యూజ‌న్ అమ్మాయి కారెక్ట‌ర్ చేసింది. ఈమె చుట్టూనే క‌థంతా తిరుగుతుంటుంది. క‌న్ఫ్యూజ‌న్ అమ్మాయికి పెళ్లి సెటిల్ అయితే ఎలా ఉంటుంది అనేది క‌థ అంతా. త‌న జీవితంలో త‌న‌కేం కావాలో కూడా తెలుసుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్న ప్ర‌తీ అమ్మాయికి ఈ చిత్రం బాగానే క‌నెక్ట్ అవుతుంది. అయితే మరీ వెబ్ సిరీస్ లా సాగ‌దీసి తీయ‌డం హ్యాపీ వెడ్డింగ్ కు ప్ర‌ధాన‌మైన మైన‌స్. ఫ‌స్టాఫ్ అంతా హీరో హీరోయిన్ కుటుంబాల మ‌ధ్య స‌న్నివేశాలే ఉంటాయి. పైగా అన్నీ ఊహించిన విధంగానే సాగుతుండ‌టం.. ప్ర‌తీ మాట‌కు ముందు వెన‌క విజ‌య‌వాడ అంటూ ప్ర‌చారం చేయ‌డంతో కాస్త అస‌హ‌నం క‌లుగుతుంది కానీ సెకండాఫ్ లో కాస్త వేగం అందుకుంటుంది క‌థ‌. ముఖ్యంగా నిహారిక లైఫ్ లో మ‌రో అబ్బాయి ఉన్నాడ‌ని తెలిసిన త‌ర్వాత క‌థ‌లో ఆస‌క్తి పెరుగుతుంది. అక్క‌డ్నుంచి బాగానే డీల్ చేసాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ వ‌ర‌కు కూడా ప‌ర్లేద‌నిపించిన క‌థ‌.. చివ‌ర్లో ముగించాలి కాబ‌ట్టి హీరోయిన్ కారెక్ట‌ర్ కు ఎలా క‌న్ఫ్యూజ‌న్ ఎలా పోయింది.. ఆ అబ్బాయిని ఎలా న‌మ్మిందో చూపించ‌కుండానే పెళ్లి చేయించేసాడు. దానికి ఒక్క డైలాగ్ పెట్టేసాడు.. అబ్బాయి స్థానంలో ఒక్క‌సారి నిల‌బ‌డి ఆలోచిస్తే తెలుస్తుంద‌ని. దాంతో సినిమా క్లైమాక్స్ ముగించేసాడు ద‌ర్శ‌కుడు. నిహారిక కారెక్ట‌ర్ లో ప్ర‌తీ అమ్మాయి క‌నెక్ట్ అవుతుంది.

న‌టీన‌టులు:
నిహారిక గ్లామ‌ర్ కాకుండా ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లు ఎంచుకోవ‌డం మంచి విష‌య‌మే. ఈ పాత్ర‌లో స‌రిగ్గా ఒదిగిపోయింది ఈ భామ‌. ముఖ్యంగా ఎక్క‌డా పెద్ద‌గా అతి కూడా క‌నిపించ‌లేదు. చాలా సెటిల్డ్ గా న‌టించింది. సుమంత్ అశ్విన్ కూడా బాగానే న‌టించాడు. విజ‌య‌వాడ అబ్బాయిగా మాటిమాటికి గుర్తు చేసాడు. రాజా చిన్న పాత్ర‌లో ప‌ర్లేద‌నిపించాడు. ఇక మిగిలిన పాత్ర‌ల్లో న‌రేష్.. ముర‌ళిశ‌ర్మ‌.. తుల‌సి.. ప‌విత్రా లోకేష్ బాగున్నారు.

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ‌లం. శ‌క్తికాంత్ కార్తిక్ పాట‌లు కూడా బాగానే ఉన్నాయి. లౌడ్ మ్యూజిక్ కాకుండా క‌థ‌కు త‌గ్గ‌ట్లే సూదింగ్ పాట‌లు ఇచ్చాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. సినిమాటోగ్ర‌ఫీ ముచ్చ‌ట‌గా ఉంది. రిచ్ విజువ‌ల్స్ క‌నిపించాయి. యువీ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ప‌ర్లేదు. కానీ విజ‌య‌వాడకు కాస్త క‌త్తెర వేసుంటే బాగుండేది. ద‌ర్శ‌కుడిగా ల‌క్ష్మ‌ణ్ కార్య ప‌ర్లేద‌నిపించాడు కానీ పాస్ మార్కుల‌కు కాస్త దూరంగానే ఆగిపోయాడు. అమ్మాయిల క‌న్ఫ్యూజ‌న్ పై వ‌చ్చే క‌థ క‌దా.. ఇంకాస్త ప‌క‌డ్భందీగా రాసుకునుంటే బాగుండేదేమో అనిపించింది.





Untitled Document
Advertisements