జగన్మోహన్‌రెడ్డి కాపుల విషయంలో ఇలా మాట్లాడడం సరికాదు -ముద్రగడ్డ

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 08:42 PM

జగన్మోహన్‌రెడ్డి కాపుల విషయంలో ఇలా మాట్లాడడం సరికాదు   -ముద్రగడ్డ

కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర పరిధిలో లేదని.. కేంద్ర పరిధిలో ఉందని వైఎస్‌ జగన్‌ తుని సంఘటన సమయంలో తమకు మద్దతిచ్చిన జగన్‌ ఇప్పుడు ఇలా మాట్లాడటం తగదన్నారు.ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కులాల వారీగా మీకు దాసోహంగా ఉండాలా? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమం పుట్టిన చోటే.. జగన్మోహన్‌రెడ్డి కాపులను బీసీల్లో చేర్చడం కుదరదని మాట్లాడటం ఎంతవరకూ న్యాయమన్నారు.
పాదయాత్రలో జగన్‌ ఇస్తున్న హామీలు నెరవేర్చడానికి కేంద్ర బడ్జెట్‌ అయినా సరిపోతుందా? అని ముద్రగడ ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు వారు మీకు ఓట్లెందుకు వేయాలని ప్రశ్నించారు. జగన్‌ అధికారం కోసం ఓట్లు కావాలంటున్నారు తప్ప.. తమ కాపు ప్రజలు ప్రయోజనాలు కోసం కాదని విమర్శించారు. జగన్‌కు పదవి కోసం ఎంత ఆరాటం ఉందో.. కాపు రిజర్వేషన్‌పై తమకు కూడా‌ అంతే ఆరాటం ఉందన్నారు. కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్లు తాగుతూ.. మీ పల్లకీలు మోస్తుండాలా? అని జగన్‌ను ముద్రగడ ప్రశ్నించారు.

Untitled Document
Advertisements