ఇండోనేషియాలో భూకంపం లోమ్‌బోక్‌ దీవుల్లో భూకంపం

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 08:52 PM

ఇండోనేషియాలో భూకంపం  లోమ్‌బోక్‌ దీవుల్లో భూకంపం

ఇండోనేషియా:ఆదివారం ఇండోనేషియాలో ఆదివారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో 14మంది మృతి చెందారు. సుమారు 162మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. లోమ్‌బోక్‌ దీవుల్లోని మాతరమ్‌ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌ జియలాజికల్‌ సర్వే తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామున 6.47గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. భూప్రకంపలు చోటుచేసుకున్న ప్రాంతంలో భవనాలు ఎక్కువ లేకపోవడంతో, అధికశాతం మైదాన ప్రాంతం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న భూకంపాల్లో ఇది తీవ్రమైన భూకంపమని.. నష్టం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Untitled Document
Advertisements