నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబంలో 6 గురు మృతి

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 10:03 PM

నల్గొండ జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబంలో  6 గురు మృతి

నల్గొండ: చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద హైద్రాబాద్‌- నాగార్జున రాష్ట్ర రహదారిపై ఆదివారం తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి బస్టాండ్‌ గోడకు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందారు. వీరంతా హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మృతులంతా ఒకే కుటుంబానికిచెందిన వారీగా గుర్తింపు. మృతులను హైదరాబాద్ టోలీచౌక్‌కు చెందిన ఎం.డి.మోహిన్, తమ్ము, ముస్తాఫా, సద్దాం, అక్తర్‌, ఆషాగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎనిమిది మంది వరకు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మూడు వాహనాల్లో ఐదు కుటుంబాలు విహార యాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Untitled Document
Advertisements