ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు సేవలకు RBI అనుమతి

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 10:09 PM

ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు సేవలకు RBI అనుమతి

దిల్లీ: ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు సేవలకు భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వడంతో ఆగస్టులో సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 650 శాఖలు, 17 కోట్ల ఖాతాలతో భారీ స్థాయిలో సేవలు ఆరంభించనుంది.
ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు పూర్తి వ్యవస్థను పరీక్షించిన తర్వాత ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిందని సురేశ్‌ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ నుంచి ఇక తుది అనుమతి రాగానే సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక బృందం చేత పరీక్షలు నిర్వహించామని, వ్యవస్థ అద్భుతంగా నడుస్తోందని ఆయన అన్నారు. 250 శాఖలతో ఈ పని నిర్వహిస్తున్నామని తెలిపారు.

దేశవ్యాప్తంగా 650 శాఖలు, పోస్టాఫీసుల్లో 3,250 యాక్సెస్‌ పాయింట్లు, 11,000 డాక్‌ సేవక్‌, పోస్టమెన్‌లతో ఐపీపీబీ ఇంటి వద్దకే బ్యాంకు సేవలు ప్రారంభించనుంది. 1,700 కౌంటర్లతో పాటు 11,000 ఇంటివద్దకే బ్యాంకు సేవలు అందించనుంది. పూర్తి స్థాయిలో కుదురుకున్న తర్వాత 1.55 లక్షల పోస్టాఫీసుల్లోనూ బ్యాంకు సేవలు ప్రారంభమవుతాయి.

Untitled Document
Advertisements