భారత్‌, యుఎస్‌ఏ మధ్య మ్యాచ్‌ .....

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 10:12 PM

భారత్‌, యుఎస్‌ఏ మధ్య మ్యాచ్‌ .....

లండన్‌: భారత్‌, యుఎస్‌ఏ మధ్య మ్యాచ్‌ రాత్రి 9.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-2లో ప్రసారమవుతుంది.తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం వరకు వచ్చి చివరకు డ్రాగా ముగించిన భారత్‌.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ చేతిలో పరాజయంపాలైంది. నాలుగు గ్రూప్‌ల్లో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌ చేరతాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించి వాటిలో విజయం సాధించిన జట్లతో మరో నాలుగు క్వార్టర్స్‌ స్థానాలు భర్తీ చేస్తారు. భారత్‌ ప్రస్తుతం గ్రూప్‌- బిలో ఒక పాయింట్‌తో మూడో స్థానంలో ఉంది. యుఎస్‌ఏ ఖాతాలో కూడా ఒక్క పాయింట్‌ ఉన్నా కూడా గోల్స్‌ తేడాతో అది నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దాంతో యుఎస్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు క్వార్టర్స్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ‘‘యుఎస్‌ఏతో మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి. దాంట్లో ఏం సందేహం లేదు. జట్టు కూర్పు, వ్యూహాలు సరిగానే ఉండడంతో అవకాశాలు వస్తున్నాయి కానీ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమవుతున్నాం. తొలి రెండు మ్యాచ్‌ల్లో చాలా అవకాశాలే లభించాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. కానీ యుఎస్‌ఏతో మ్యాచ్‌లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం’’ అని కోచ్‌ జోర్డ్‌ మారిజ్నె తెలిపాడు.

Untitled Document
Advertisements