మాఫీ ఫోటో పై సమంత రిప్లయ్

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 10:21 PM

మాఫీ ఫోటో పై సమంత రిప్లయ్

సమంత, తనకు ట్విట్టర్ ఖాతాలో కనిపించిన ఓ ఫొటోపై తనదైన శైలిలో ఫన్నీగా స్పందించింది. ఓ యువకుడు సమంతను పెళ్లి చేసుకున్నట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోను 'అల్లు అర్జున్ అడిక్ట్' అనే ట్విట్టర్ ఖాతా పోస్టు చేస్తూ, "ఏంటిది?" అన్న కామెంట్ పెట్టింది. ఇది అలా ఇలా తిరిగి సమంత వరకూ చేరింది. ఆపై స్పందించిన సమంత "వారం రోజుల క్రితం మేమిద్దరమూ విడిపోయాము. ఈ ఫొటో ఎలా లీక్ అయిందో. మాది తొలి చూపు ప్రేమ" అని చమత్కరిస్తూ సరదాగా రిప్లయ్ ఇచ్చింది. ఈ రెండు ట్వీట్ లూ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Untitled Document
Advertisements