బంగారు బోనంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 10:27 PM

 బంగారు బోనంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : తెలంగాణ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా , నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అనంతరం డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య బంగారు బోనాన్ని తలకెత్తుకుని ఆలయంలోకి .కల్వకుంట్ల కవిత, నడిచారు. అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఈ ఉదయం ఆలయం వద్దకు వచ్చిన కవితకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
1008 మంది మహిళలు 1008 బోనాలతో కవిత తెచ్చిన బంగారు బోనానికి తోడుగా అనుసరించారు. కవిత వచ్చిన సమయంలో ఆలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఊరేగింపులో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Untitled Document
Advertisements