మొక్కలు నాటుతున్న ఫొటోలతో మోహన్ బాబు

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 11:03 PM

మొక్కలు నాటుతున్న ఫొటోలతో  మోహన్ బాబు

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు మోహన్‌బాబు యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా ఇటీవల కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి..హరితహారం ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు స్పందిస్తూ.. మొక్కలు నాటుతున్న ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘ఇదిగో.. ఛాలెంజ్‌ను పూర్తి చేశా. విద్యానికేతన్‌లోని మా పిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరుతున్నా. మనకు ఇంకా ఎక్కువ పచ్చదనం కావాలి. మీరు మొక్కలు నాటుతున్న ఫొటోలను నాకు పంపండి’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.

ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, సైనా నెహ్వాల్‌, సచిన్‌, కేథరిన్‌ హడ్డా తదితరులు ఇందులో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని తెలుపుతూ ప్రారంభించిన ఈ హరితహారం ఛాలెంజ్‌ను ఇప్పటికే పలువురు ప్రముఖులు స్వీకరించారు.

Untitled Document
Advertisements