కులాలవారీగా, మతాలవారీగా దేశాన్ని విభజించాలని చూస్త్తే

     Written by : smtv Desk | Wed, Aug 01, 2018, 01:14 PM

కులాలవారీగా, మతాలవారీగా దేశాన్ని విభజించాలని చూస్త్తే

న్యూఢిల్లీ, ఆగస్టు 01: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ ఆమె పార్లమెంట్‌కు వెళ్లారు. అక్కడ బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని కలివారు. అసోంలో 40 లక్షల మందిని పౌరసత్వ జాబితా నుంచి తొలిగించిన అంశాన్ని అద్వానీతో బెంగాల్ సీఎం మాట్లాడి ఉంటారని అంచనా వేస్తున్నారు. సిటిజన్స్ లిస్టు నుంచి పేర్లు తొలిగించడం వల్ల పౌర యుద్ధం వస్తుందని దీదీ ఆరోపించారు. పార్ల‌మెంట్‌కు వ‌చ్చిన బెన‌ర్జీ అక్క‌డ వివిధ పార్టీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్ల‌ను కూడా క‌లిశారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ మరోసారి మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. అసోం సిటిజన్స్ జాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో క్రైస్తవుల సదస్సులో మమత మాట్లాడుతూ.. వాళ్లు అసోంలో ఎలా నివసిస్తారు? వాళ్లకు ఆహారం, ఇండ్లు, స్కూళ్లు ఎలా? ఇలాంటి చర్యలు పౌరయుద్ధం, రక్తపాతానికి దారితీస్తాయి.

రాజకీయ దురుద్దేశంతోనే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) తయారు చేశారు. ఇలాంటివి జరుగకుండా అడ్డుకుంటాం. చివరికి మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహ్మద్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా జాబితాలో లేకపోవడం ఆశ్చర్యకరం. ఇంతకన్నా దారుణం ఉంటుందా?

బీజేపీ వాళ్లు ప్రజలను విభజించాలని చూస్తునారు. మేము సహించబోము. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమివేయాలి. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కులాలవారీగా, మతాలవారీగా దేశాన్ని విభజించాలని చూస్త్తే సహించబోము అని స్పష్టం చేశారు.

Untitled Document
Advertisements