ధోనీ భార్యను టార్గెట్‌ చేస్తున్నారు

     Written by : smtv Desk | Wed, Aug 01, 2018, 02:23 PM

ధోనీ భార్యను టార్గెట్‌ చేస్తున్నారు

న్యూఢిల్లీ, ఆగస్టు 01: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ భార్య సాక్షి.. ఇప్పుడు సోషల్‌మీడియాలో టార్గెట్‌గా మారింది. స్నేహితురాలు పూర్ణా పటేల్‌ వివాహానికి కుటుంబంతోసహా సాక్షి హాజరైంది. అయితే, ఈ కార్యక్రమానికి ఆమె ఎంతో ఆకర్షణీయమైన లెహంగాను ధరించింది. సంగీత్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసింది.

చూడగానే ఆచ్ఛాదనం లేకుండా ఎక్స్‌పోజ్‌ చేస్తున్నట్టుగా ఆ డ్రెస్‌ ఉంది. వాస్తవానికి ఆ డ్రెస్‌ను స్కిన్‌ కలర్‌ వస్త్రంతో డిజైన్‌ చేయడంతో అది శరీరంలో కలసిపోయింది. వీటి ని చూసిన కొందరు.. డ్రెస్‌ సెన్స్‌ లేదంటూ తిట్టిపోశారు. ధోనీ మర్యాదను కాపాడే విధంగా నడుచుకోవాలని ఓ నెటిజన్‌ హితవు పలికాడు. ‘సాక్షి గారు మీరంటే గౌరవం.. కానీ ఇలా దిగజారుడుగా కనిపించొద్దని మరో వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. భారీగా విమర్శలు చెలరేగుతుండడంతో సాక్షి అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

Untitled Document
Advertisements